15-10-2025 07:44:13 PM
చిట్యాల ఎస్ఐ జీ.శ్రావణ్ కుమార్..
చిట్యాల (విజయక్రాంతి): పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ జి.శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామ ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామన్నారు. 52 పేక ముక్కలు, రూ. 2000 నగదును స్వాధీన పరుచుకున్నామని తెలిపారు. పేకాడుతున్న జూకల్ గ్రామానికి చెందిన వ్యక్తులు కావాటి రాజు, సూర లక్ష్మణ్, తోట శ్రవణ్, సుర శ్రీకాంత్, తోట బిక్షపతి, శ్రీగిరి రవీందర్ లపై కేసు నమోదు చేసామన్నారు. దాడిలో పోలీస్ సిబ్బంది అస్లాం జానీ, నాగరాజు, సందీప్ పాల్గొన్నారు.