calender_icon.png 16 October, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్న బిజెపి

15-10-2025 07:44:03 PM

పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్  బిల్లును చట్ట సవరణ చేసి అమలు చేయాలి

 సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి డిమాండ్

చిలుకూరు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవోను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించిన కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికల ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన సమితి మరియు సిపిఐ పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు చిలుకూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు  ధర్నా చేసి అనంతరం తహసిల్దార్ ఆర్.ద్నవకుమార్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... కేంద్రములో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.బీసీలను ఇంకెన్నాళ్ళు వెనకబడేస్తారని బిసి లను కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.