06-11-2025 01:39:30 PM
విచారణ చేస్తున్న పోలీసులు..
ఇది రెండోసారి ఘటన..
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయం(Sri Hanuman temple) హుండీ చోరీ జరిగింది. గత రాత్రి గ్రామానికి చెందిన భక్తులు యధావిధిగా పూజలు నిర్వహించి గుడికి తాళం తీసి ఇంటికి వెళ్లారు. నేడు ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు హుండీ ధ్వంసం అయినా విషయాన్ని గమనించి పోలీసులకు గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గతంలో కూడా హుండీ చోరి ఘటన జరిగింది. హుండీ చోరీ జరగడం ఇది రెండవసారి అని గ్రామస్తులు భక్తులు అంటున్నారు.