10 April, 2026 | 2:55 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ అగ్ర నేతలపై కేసులు

17-04-2025 05:26 PM

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి...

మునగాల: కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ అగ్ర నేతలపై కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తక్కలపాటి సాయి అన్నారు. గురువారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తదనంతరం సాయి మాట్లాడుతూ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవస్థలను శాసిస్తుంది. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం వారి రాజకీయ స్వార్థమేనని స్పష్టమవుతుంది.  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య  విలువలకు తూట్లు పొడిచే మోడీ ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈడీ, సీబీఐ లాంటి సంస్థల ద్వారా కేసుల నమోదుతో ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరిస్తూ గొంతు నొక్కాలని చూస్తుంది. ఇది ఎల్లకాలం నడవదు. కాంగ్రెస్ పార్టీ సైనికులుగా, ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యం కూని కాకుండా ప్రజాస్వామ్యవాదులుగా  మనందరం మోడీ ప్రభుత్వ చర్యలపై పోరాటం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వేనేపల్లి వీరబాబు గట్టు ఉపేందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.