25-07-2025 01:50:10 AM
కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక
యాదాద్రి భువనగిరి జూలై 24 ( విజయ క్రాంతి ): యూరియా, ఎరువులను కృత్రిమ కొరత సృష్టించిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. గురువారం రోజు బీబీనగర్ లో ఫెర్టిలైజర్ షాప్ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏఓ తో కలిసి ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు .షాప్ లైసెన్స్ , ఫర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని పరిశీలించారు.
షాప్ లో రిజిస్టర్ సరిగా మెయింటెన్ చేస్తున్నారు లేరా అని ఆరా తీశారు. రైతులకు ఏ మందులు కొనుగోలు చేస్తున్నారు అని షాప్ యజమాని అడిగి తెలుసుకున్నారు. రైతులు అడిగినవి ఇస్తున్నారా మీరు ఏమైనా డిమాండ్ చేసి ఇస్తున్నారా అని అన్నారు. రైతులకు సరిపోయే యూరియా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్ లో నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు. ...
మందులు బయట మెడికల్ షాపులకు రాస్తే డాక్టర్లపై చర్యలు
బీబీనగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది యొక్క హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రి లో వైద్య సిబ్బంది అందరూ వచ్చారా లేరా అని ఆరా తీశారు. రోజు ఓపి కి ఎంత మంది వస్తున్నారు అని డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి లో ప్రతి నెల ఎన్ని డెలివరీ లు అవుతున్నాయి అని అడిగి తెలుసుకొని,డెలివరీల సంఖ్య పెరగాలని అన్నారు.
ప్రస్తుతం డెలివరీ కి ఉన్న గర్భిణి మహిళతో ఫోన్ లో మాట్లాడి ప్రతి నెల చెకప్ కి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్ సమయానికి ఇస్తున్నారా , స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రి లోనే చేస్తున్నారా , బయటికి పంపిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించు కోవాలని, ఆసుపత్రి లో మెరుగైన వైద్యం సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆసుపత్రి కి వచ్చిన రోగులకు మెడిసిన్ అందుబాటులో లేక బయటికి రాశారు అని తీసుకొని వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మాట్లాడి అన్ని మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.అసంపూర్తి పనులతో నిలిచి పోయిన ఆసుపత్రి నూతన భవనాన్ని పరిశీలించి వెంటనే మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో నూతన ఆసుపత్రి భవనం ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.