calender_icon.png 6 August, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల పోరాటం.. ఢిల్లీ ధర్నాలో సీఎం రేవంత్

06-08-2025 01:44:56 PM

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా కొనసాగుతోంది. జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ,  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేయాలంటూ కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. బీసీ ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలు(India Alliance MPs) మద్దతు తెలిపారు. ధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ధర్నాలో సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ మహా ధర్నాను ప్రారంభిస్తారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీలు హాజరైయ్యారు.