calender_icon.png 5 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిలాఫలకాల ధ్వంసం తప్ప అభివృద్ధి ఎక్కడ..?

25-07-2025 01:51:46 AM

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్, జులై 24 : నకిరేకల్ నియోజకవర్గంలో  గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి. కొత్త శిలాఫలకాలు వేశారు తప్ప అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పాలని మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు చీము నెత్తురు ఉంటే శిలాఫలకాలను ధ్వంసం చేయడం కాదని అభివృద్ధిలో పోటీపడాలని సవాల్ విసిరారు.  రాజకీయ కుట్రలతో సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా దమ్ముంటే నియోజకవర్గానికి అధిక నిధులుతీసుకురావా లన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బిఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడలేని అభివృద్ధి,సంక్షేమపథకాలు అమలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగాయన్నారు.

కిరేకల్ నియోజకవర్గంలో రౌడీరాజ్యంనడుస్తోందన్నారు. గుడిలోకి రానివ్వొద్దు అనే విషపు సంస్కృతి నకిరేకల్ లో కనిపిస్తుందని మండిపడ్డారు. కేటీఆర్ జయంతి పురస్కరించుకొని పాలెం గుడిలో పూజలు నిర్వహించారు.

అనంతరం ఫంక్షన్ హాల్ లో 200 మంది యువకులు రక్తదానం నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మాధగోని ధనలక్ష్మి నగేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.