calender_icon.png 6 August, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు జై కొట్టిన కనిమొళి

06-08-2025 01:58:45 PM

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్( Telangana Congress) పార్టీ మహా ధర్నా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ జంతర్ మంతర్ లో సాగుతున్న దీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీలు దీక్షకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ బీసీ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) జైకొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లు కు కనిమొళి(డిఎంకె) లోక్ సభ ఎంపీ మద్దతు ఇస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంపుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు డిఎంకె మద్దతు ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని  స్థాయిల్లో మద్దతు ఉంటుందన్నారు. పార్లమెంటు లో కూడా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలు చేసే పోరాటానికి మద్దతు ఉంటుందన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఎంపీ కనిమొళి సూచించారు. న్యాయానికి ఎలాంటి పరిమితులు విధించవద్దన్నారు. రిజర్వేషన్లకు(BC reservation) 50 శాతం పరిమితి ఉండాలని ఎవరూ చెప్పలేరని తెలిపారు.