05-09-2025 12:00:00 AM
యాచారం, సెప్టెంబర్ 4 : వాహనాల రాకపోకలను అడ్డుకొని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ పోలీసు విధులను అడ్డుకున్న ఏడుగురి పై కేసులు నమోదైన ఘటన గురువారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నందీశ్వర్ రెడ్డి, తెలిపిన వివరాల ప్రకారం..
మండల పరిధిలోని మొగుళ్ళ వంపు గ్రామంలోని హనుమాన్ యూత్ అసోసియే షన్ సభ్యులు బండ శ్రీనివాస్ రెడ్డి, గౌ రారం లింగారెడ్డి, నందీశ్వర్ రెడ్డి, రేసు రాము, పట్టణ చంద్రశేఖర్ రెడ్డి, మూడేళ్ల శ్యాంసుందర్, నాయిని వెంకటరెడ్డి, గణపతి నిమర్జనంలో డిజె సౌండ్ వాల్యూ మ్ తో గ్రామస్తులకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలిగిస్తూ అక్కడికి వెళ్లిన పోలీసుల విధులను అడ్డుకొని దురుసుగా ప్రవర్తించడంతో వారిపై కేసులు నమో దు చేసి నిమజ్జనం వేడుకలలో వాడిన ఆటో, సౌండ్ సిస్టమ్ డీజే స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు.