13 July, 2026 | 2:02 AM

అందరివాడు హరీశ్‌రావు

05-09-2025 12:00 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : మాజీ హరీశ్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయ న బీఆర్‌ఎస్‌కి ఒక చరిత్ర అని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి గురువారం పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు హరీశ్‌రావు ఒక సంపద అని, అలాంటి వ్యక్తిని బలహీనపరిచేలా మాట్లాడితే తెలంగాణకు నష్టమని పద్మఅన్నారు.

మంత్రిగా, ఎమ్మెల్యే గా, కార్యకర్తగా అందరికీ అందుబాటులో ఉండి ఆయన పని చేశారన్నారు. ఆయనపై కవిత చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ డొల్లతనాన్ని హరీశ్‌రావు ఎండగడు తుంటే.. ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి కాళ్లు మొక్కారంటూ కవిత ఆరోపించడం దారుణమన్నారు. హరీశ్‌పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్‌కు ఆయన ట్రబుల్ షూట ర్ అని, ఏ శాఖ ఇచ్చిన అత్యంత సమర్థంగా నిర్వర్తించారని తెలిపారు. గతంలో కవిత నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా పార్టీలోని ముఖ్య నేతలకు సమాచా రం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కుమార్తెగా పార్టీలో లభించిన గౌరవాన్ని కవిత నిలుపుకోలేకపోయారన్నారు. 

కవిత హరీశ్‌రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంద ని, బీఆర్‌ఎస్ శ్రేణులను కవిత బాధకు గురి చేశారని ఆవే దన వ్యక్తం చేశారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశం ఇచ్చారని తెలిపారు. కవితపై సస్పెండ్ నిర్ణయాన్ని ప్రతీ కార్యకర్త హర్షిస్తున్నారని స్పష్టం చేశారు.