23 August, 2026 | 2:31 AM

ఒక్కరోజే 400 కేసులు పరిష్కారం

23-08-2026 12:53 AM
  1. సుప్రీంకోర్టు లోక్ అదాలత్‌కు విశేష స్పందన
  2. సమాధాన్ సమారోహ్ మూడురోజల ప్రత్యేక డ్రైవ్ ‘సమాధాన్ సమారోహ్ ప్రత్యేక డ్రైవ్

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ‘సమాధాన్ సమారోహ్ పేరుతో సుప్రీంకోర్టు చేపట్టిన కేసుల పరిష్కారం వేగవంతమైంది. మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో శుక్రవారం ఒక్కరోజే 400 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు శనివారం లోక్‌అదాలత్ అధి కారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యే క డ్రైవ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో పనిచేస్తుంది. ఆదివారంతో ప్రత్యేక డ్రైవ్ ముగియ నుంది. లోక్ అదాలత్ ద్వారా తొలిరోజు 600 కేసులను పరిష్కరించాలని లక్ష్యం పెట్టుకోగా 400 కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం 16 ప్రత్యేక బెంచ్‌లు, డ్రైవ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వైవాహిక, ఆస్తి, ప్రమాద క్లయిమ్‌లు, నష్టపరిహారాలు, కార్మిక వివాదాలు తదితర కేసు లను పరిష్కరించామని ప్రకటనలో స్పష్టం చేశారు. సుధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంతో దేశంలోని ఆయా కో ర్టులపై ఉన్న భారం తగ్గుతుంది. ఇరుపక్షాల అంగీకారం, చర్చలతో వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది. ఇదొక మంచిపరిణా మమని, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తుందని పలువురు భావిస్తున్నారు.