23 August, 2026 | 1:47 AM

ఏఐని అడిగి కొత్త వ్యాధులు తెచ్చుకోవద్దు!

23-08-2026 12:55 AM
  1. వైద్యుల సూచనలే ముఖ్యం
  2. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ‘చాట్ జీపీటీ’పై ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఇంటర్నెట్, చాట్ జీపీటీల్లో చూసి వ్యాధి లక్షణాలను వెతికే వా రి సంఖ్య పెరుగుతోందని, వాటిలోని వివరాలను చూసి తమకు తామే ఫలానా వ్యాధి ఉందని నిర్ధారించుకోవద్దని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ ప్రజలకు సూచించారు. ఆరోగ్యంపై అవగాహన పెం పొందించుకోవడం మంచి పరిణామామే అయినా, అనారోగ్యానికి గురైతే వైద్యుడి వద్దకు వెళ్లాలన్నారు. శనివారం నోయిడాలో ‘మహాజన్ ఇమేజింగ్ అండ్ ల్యాబ్స్’ను కేం ద్రమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభావేదికపై ప్రసంగించారు. ఇంటర్నెట్‌లో కనిపించే సమాచారంతో తమకు తాము రోగ నిర్ధారణ చేసుకోవడం సరైంది కాదన్నారు. స్వల్పంగా నొప్పి వచ్చినా దాన్ని గుండెజబ్బుగా భావించొద్దన్నారు. వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు రోగులు వారిలో ఉన్న లక్షణాలు చెప్పకుండా నెట్ మాధ్యమంగా ఉన్న వ్యాధి పేర్లను వైద్యులకే చెబుతున్నారని అన్నారు. ఇది ఎంతమాత్రం సబబు కాదని గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు అనేవి ఒక్కరోజులోనే రావని గుర్తుంచుకోవాలన్నారు.

వ్యాధి ముదిరాక లక్షలు ఖర్చు చేయడం కంటే, ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదిస్తే మంచిదన్నారు. సకాలంలో శరీరంలో వచ్చిన, వస్తున్న మార్పులను గుర్తి ంచడంలోనే ఆరోగ్య సంరక్షణ దాగి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాధి ని వారణ, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించకుంటే భవిష్యత్‌లో ఆసుపత్రులపై భారం పెరుగుతుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అనేది ‘జాతీయ ఆర్థిక వ్యవస్థ, భద్రత’కు సం బంధించిన విషయం కూడా తెలుసుకోవాలని వివరించారు.

రోగి నమ్మకాన్ని కాపాడ టమే ఆరోగ్య సంరక్షణ రంగంలోని ప్రతీఒక్కరి అతిపెద్ద బాధ్యత అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారతదేశంలో పెద్ద సంఖ్య లో వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు ఉన్నారని, దీనికి తోడు వేగంగా విస్త రిస్తున్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థ, స్టార్టప్‌లు ఉండటం వల్ల ఆరోగ్య సంరక్షణ ఆవి ష్కరణలలో దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

‘ఆయుష్మాన్ భారత్’ కింద ఇప్పటివరకు 35 కోట్ల మందికి నాణ్యమైన చికిత్స లభించిందని ఈ ఘనత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో సహా బీజేపీ ఎంపీ లు మహేష్ శర్మ, బాన్సూ రి స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.