15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

06-12-2025 12:00 AM

విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు

పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ శ్రీరామ్

పాపన్నపేట, డిసెంబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రం పాపన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన తప్పక పాటించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలక్షన్ బూతుల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిప్రసాద్, నవ్య, అన్వర్, చందర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు.