18 April, 2026 | 7:52 AM

బోల్తాపడిన కారులో భారీగా నగదు స్వాధీనం

12-05-2024 01:14 PM

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దేవునితండాలో దగ్గర ఆదివారం ఇన్నోవా వాహనం మూడు పల్టీలు కొట్టి బోల్తాపడింది. బోల్తా పడిన కారులో భారీగా నగదు పట్టుబడింది. కారులోని 2 బ్యాగుల్లో సుమారు రూ. కోటి 5 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుకు ఎలాంటి రసీదులు లేకపోవడంతో పోలీసులు క్యాస్ ను సీజ్ చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ ను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పట్టుబడిన నగదుపై కూసుమంచి పోలీసులు  ఆరా తీస్తున్నారు.