10 July, 2026 | 8:55 PM

Breaking News

జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం

10-07-2026 07:26 PM

బోధన్,(విజయక్రాంతి): ఎడపల్లి మండలం జానకంపేటలో నిర్వహించిన CATC-IV వార్షిక ఎన్సీసీ శిక్షణ శిబిరం శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది. జూలై 1 నుంచి 10 వరకు జరిగిన ఈ శిబిరంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 525 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. వారిని నాలుగు కంపెనీలుగా విభజించి వెపన్ ట్రైనింగ్, డ్రిల్, ఎఫ్సీబీసీ, మ్యాప్ రీడింగ్ తదితర అంశాల్లో శిక్షణతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు.