అలవి వలలు పట్టివేత
దాడులు చేసిన మత్స్యశాఖ రెవెన్యూ, పోలీసులు..
అలంపూర్: గత కొన్ని నెలల నుండి కృష్ణా నదిలో అక్రమంగా అలవి వలలవేట కొనసాగుతున్నడంతో విషయం తెలుసుకున్న మత్స్య శాఖ, రెవెన్యూ,పోలీస్ శాఖ అధికారులు ముక్కమ్మడిగా దాడులు చేసి అలవి వలన పట్టుకున్నారు. మూడు శాఖల అధికారులు సమన్వయంతో పక్క సమాచారంతో కృష్ణా నదిలో అలవి వలలు పడుతున్నారని తెలుసుకొని బుధవారం రోజు అధికారులు చేపలు పడుతున్న ప్రదేశానికి వెళ్లి అలవివలలను, చేపలను పడుతున్న వైజాగ్ వారిని అరెస్టు చేసి అలంపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.
గత కొన్ని నెలల నుండి అలవి వలలతో పడుతున్న చేపల సమాచారాన్ని జిల్లా పోలీస్ రెవెన్యూ అధికారులకు కొంతమంది సమాచారం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అలివి వలలు పట్టడానికి గుంంది మల్ల గ్రామంలో కొంతమంది సహకరిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు పక్కగా ప్రణాళికలతో కృష్ణ నదిలో దాడులు చేసి అలవి వలలను పట్టుకోవడం జరిగింది. ఈ దాడులలో మత్స్య శాఖ అధికారి సెకిలాబాను, తాసిల్దార్ మంజుల,ఎస్సై వెంకట్ స్వామి, పోలీస్ సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు.




