1 April, 2026 | 10:45 PM

రోడ్లపై పశువులు.. ప్రమాదాలకు దారులు..!

06-05-2024 01:37 AM

మంథని, మే 5 : పైన చిత్రంలో కనిపిస్తున్నది బందెల దొడ్డి అనుకుంటే పొరబాటే.. ఇది మంథని ప్రధాన రోడ్డు. ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా లేకుండా మూగ జీవాలు ప్రధాన రోడ్లపైనే సంచరించడం పరిపాటిగా మారింది. పశువులు రోడ్లపై సంచరిస్తుండడంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ జరగరాని ప్రమాదాలు ఏవైనా చోటుచేసుకుంటే అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. పశు సంచారాన్ని అరికట్టాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. రాత్రిపూట రోడ్లపైకి పదుల సంఖ్యలో చేరడంతో వాహన చోదకులు పలుమార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి.