హోం ఓటింగ్‌లో వృద్ధులు, దివ్యాంగులు
06-05-2024 01:37 AM
కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు ఆదివారం హోం ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి పట్టణం, మండలంలోని నర్సన్నపల్లితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఈసీ నిబంధనల మేరకు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. హోం ఓటింగ్ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నట్లు చెప్పారు.




