12 June, 2026 | 5:01 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తలు తప్పనిసరి

29-11-2025 08:18 PM

- అభ్యర్థి వెంట ఇద్దరు బలపరిచే వ్యక్తులకు మాత్రమే అనుమతి

- తహసీల్దార్ గిరిబాబు, ఎంపిడివో రాజు, ఎస్సై రాజు

వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లా రాజు, ఎంపీడీవో మూడు రాజు సూచించారు. నామినేషన్ దాఖలు విధానం, అవసరమైన పత్రాలపై అధికారులు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... నామినేషన్‌తో పాటు ఇద్దరు సాక్షులతో సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరిగా సమర్పించాలని, నామినేషన్ సమయంలో డిక్లరేషన్ సమర్పించకుండా ఉంటే, చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపులో సమర్పించాల్సి ఉంటుందని, డిక్లరేషన్‌కు అఫిడవిట్, నోటరీ అవసరం లేదని స్పష్టం చేశారు.

నామినేషన్ పత్రంలో ఉన్న అన్ని నిలువు వరుసలను పూర్తిగా పూరించాలని, ఏ కాలమ్‌ను ఖాళీగా వదలరాదని, సంబంధిత వివరాలు లేనప్పుడు సందర్భానుసారంగా ‘నిల్’ లేదా ‘వర్తించదు’ అని నమోదు చేయాలని సూచించారు. అభ్యర్థులు పోస్టల్, బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా, నామినేషన్ కోసం కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం జత చేయాలని, సర్పంచ్, వార్డ్ మెంబర్ పోస్టులకు పోటీ చేసే వారు సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలని, నామినేషన్‌కు సంబంధించిన అన్ని సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులు అభ్యర్థులను కోరారు.