15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

వర్షాకాలం విద్యుత్ వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలి

27-06-2025 01:41 AM

విద్యుత్ శాఖ ఎస్‌ఇ ఇనుగుర్తి శ్రీనివాసాచారి

ఖమ్మం, జూన్ 26 (విజయ క్రాంతి):విద్యుత్ వినియోగదారులు ముఖ్యంగా రైతులు వర్షా కాలం విద్యుత్ వినియోగం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని  ఖమ్మం సర్కిల్  సూపెరింటెండింగ్ ఇంజనీర్, ఇనుగుర్తి శ్రీనివాసా చారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్పుడైనా రైతులు , వినియోగదారులు సొంతంగా విద్యుత్ కు సంబంధించిన పనులు ఎట్టి ప రిస్థితిల్లో చేయకూడదని అన్నారు. కంటికి కనపడని విద్యుత్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు . ప్రతి వైర్లలో క రెంట్ ప్రసారం అవుతుందన్న అవగాహనతో మెలగాలని అ న్నారు.

తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదని, ప్రమాదకరంగా ఉన్నటువంటివి గమనించిన వెంటనే సంబందిత విద్యుత్ సి బ్బందికి టోల్ ఫ్రీ నo.1912 ద్వారా తెలియచేయజేయాలనీ కోరారు. ఇండ్లలో బట్టలు ఆరవేసే జి.ఐ దండెము, వైర్ల వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని , త ద్వారా విద్యుత్ ప్రసారం కాకుండా విద్యుత్ ప్రమాదాలను ని యంత్రించవచన్నారు.

అలాగే ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. క నుక స్థంభం నుండి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహిం చాలని తెలిపారు. పశువుల యాజమానులు మేతకు తీసుకువెళ్ళినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు , స్థంబాలు దగ్గరికి వెళ్లకుండా కాపరి వాళ్ళు జాగ్రత్త వహించాలని కోరారు . ఒక వే ళా కరెంట్ వైర్లు కింద పడి ఉంటె కాపరి వాళ్ళు గమనించి ప శువులను వాటిని తాకకుండా అప్రమత్తం చేయాలనీ తెలిపారు.

ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయాలనీ, నాణ్యమైన ప్లగ్గులు, సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించాలని సూసించా రు.వినియోగదారుల గృహాలలోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల , నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన, రై తులు స్విచ్ బోర్డు/మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించక పోవడం వలన విద్యుత్ ప్రమాదా లు తరచుగా జరుగుతున్నాయని అన్నారు.సమస్య తలెత్తిన టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సంప్రదించాలని కోరారు.