12 July, 2026 | 12:46 AM

వయోజన టీకాలు రోగనిరోధకతను బలోపేతం చేస్తాయి

27-06-2025 01:41 AM

ప్రతిమ గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. హారని రావు

ముషీరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని, వయోజన టీకాలు (వ్యాక్సిన్) తీసుకుంటే మన శరీరాలు ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడతాయని ప్రతిమ గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. హారని రావు తెలిపారు.

హైదరాబాద్, కాచిగూడ, ప్రతిమ ఆసుపత్రిలో గురువారం ‘పెద్దలకు టీకాల ప్రాముఖ్యత‘ అనే అంశంపై సదస్సు జరిగింది. డా. హారని రావు ముఖ్యఅతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించగా, ప్రము ఖ వైద్యులు, డయాబెటాలజిస్ట్, లిపిడాలజిస్ట్, ప్రతిమ ఆసుపత్రి డిపార్ట్మెంట్ అఫ్ అకాడెమిక్స్  మరియు మెడికల్ సర్వీసెస్ హెచ్‌ఓడి డా. జి. హరిచరణ్ వయోజన టీకాల ప్రాముఖ్యత పై మాట్లాడారు.