29 July, 2026 | 9:14 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

30-11-2025 08:30 PM

-ప్రభుత్వపథకాలను ఇంటిటికీ చేర్చాలి 

-సర్పంచ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

-మంత్రి పొన్నం ప్రభాకర్

-ముఖ్య నేతలతో సమీక్ష

చిగురుమామిడి (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ లో సోమవారం సీఎం పర్యటన, సర్పంచ్ ఎన్నికలపై ముఖ్య నేతలతో ఆదివారం మహాలక్ష్మి గార్డెన్స్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు బహిరంగ సభను విజయవంతం చేయాలని, చిగురుమామిడి మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటా ముఖ్యమంత్రి పర్యటనపై కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. బహిరంగ సభకు తరలివచ్చేలా నేతలంతా సమన్వయం చేసుకోవాలన్నారు. 

సర్పంచ్ ఎన్నికల్లో చిగురు మామిడి మండలంలో అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయాలని, అందుకోసం నేతలంతా సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఒక్కరే ఉండాలని, వారు గెలవడానికి మిగిలిన నేతలంతా ఐక్యంగా పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గౌరవెల్లి ప్రాజెక్ట్ పై అడ్డంకులు ఒక్కొకటిగా తొలగుతున్నాయని, కాలువలు పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. తన గెలుపునకు ఎలా పని చేశారో.. తాను కూడా అందరి విజయానికి కృషి చేస్తానన్నారు.