2 July, 2026 | 2:17 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం

27-06-2025 12:54 AM
  1. అలకనంద నదిలో పడిపోయిన బస్సు
  2. ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదిమంది గల్లంతు

న్యూఢిల్లీ, జూన్ 26: ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌తో పాటు 20 పర్యాటకులున్న బస్సు గురువారం అలకనందనదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది గల్లంతయ్యారు. ఘోల్తీర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిం ది. ఉత్తరాఖండ్ పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 8 మందిని సురక్షితంగా కాపాడా రు.

తప్పిపోయినవారి కోసం గాలింపు చర్య లు కొనసాగుతున్నాయి. ఐజీ నీలేశ్ ఆనంద్ మాట్లాడుతూ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి పలువు రు పర్యటకులు బద్రీనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.  రాష్ట్రంలో భారీగా వర్షాలు కు రుస్తుండటంతో నది పొంగిపొర్లుతోంది.

దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. మరో ఐదుగురు రుద్ర ప్రయాగ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ‘ఎక్స్’ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.