కార్నర్ మీటింగ్‌కు అనుమతులున్నాయా?
మీ పార్టీ నిబంధనలను పాటించిందా?
జన సందోహ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి సీబీఐ కీలక ప్రశ్నలు
న్యూఢిల్లీ, జనవరి ౧౨: ‘కరూర్‌లో కార్నర్ మీటింగ్‌కు అన్ని రకాల అనుమతులు తీసుకున్నారా? సభ నిర్వహణకు అన్ని రకాల నిబంధనలు పాటించారా? భారీ జనసందోహాన్ని నియంత్రించేందుకు మీ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు పాటించింది ? తొక్కిసలాట జరిగిన సమయంలో పార్టీ వలంటీర్లు ఎలాంటి పాత్ర పోషించారు’ అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. తొక్కిసలాటలో తన ప్రమేయమేమీ లేదని విజయ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ సోమవారం చెన్నై నుంచి ఉదయం ప్రత్యేక ఫ్లుటైలో ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన్ను సుమారు ఏడు గంటల పాటు విచారించారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత విజయ్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. విచారణ సమయంలో విజయ్ అధికారులకు పూర్తి సహకారం అందించినట్లు సమాచారం.




