13-01-2026 01:49:01 AM
చిట్టగాంగ్ జిల్లాలో ఘటన
ఢాకా, జనవరి ౧౨: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఓ హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. దగన్‌భుయాన్ ప్రాంతానికి సమీర్ దాస్ (౨8) అనే హిందువు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి అతడి ఇంటివద్దకు వెళ్లిన దుండగులు కిరాతకంగా కొట్టి, కత్తితో పొడిచి చంపారు. హత్య అనంతరం ఆటోను సైతం అపహరించి పరారయ్యారు. ఈ హత్యను ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడడం సరికాదని, నిందితులకు శిక్షపడేలా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సమీర్ దాస్ హత్యపై చిట్టగాంగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.