గ్రామాభివృద్ధే మా లక్ష్యం: సర్పంచ్
31-03-2026 06:18 PM
వాంకిడి,(విజయక్రాంతి): జంబుల్దారి గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ కొమరం పవన్ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం గ్రామానికి మరింత సౌకర్యాలను తీసుకురావడంలో భాగమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, రోడ్లు, పారిశుధ్యం వంటి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్నులే విట్టల్, వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్నులే నారాయణ, డి.కొండ మహేష్, ఉప్పల కృష్ణతో పాటు కార్యదర్శి సత్యనారాయణ, కరోబార్ హరిదాస్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




