లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్
హైదరాబాద్: వివాదంలో ఉన్న ఇంటి పత్రాల విషయంలో లంచం తీసుకుంటూ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. సీసీఎస్‌లో ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో గురువారం దాడాలు నిర్వహించారు.వివాదంలో ఉన్న ఇంటి పత్రాలను ఇవ్వడానికి బాధితుడి నుంచి రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాదితుడు చేసేదేమిలేక మొదటి విడుతలో రూ.5 లక్షలు, రెండో విడతలో రూ.3 లక్షలు చెల్లించాడు. మిగత డబ్బును శనివారం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చకున్నారు. సీసీఎస్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్ లో బాధితుడి నుంచి ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అక్కడికి చేరుకున్నారు. ఏసీబీ సిబ్బందిని గుర్తించి సుధాకర్ డబ్బు వదిలేసి రోడ్డుపై పరుగులు తీశాడు. అతన్ని వెంబండి పట్టుకున్న ఏసీబీ అధికారులు డబ్బునుచేజ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.






