11 August, 2026 | 1:58 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

శాంతినగర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు ఏర్పాటు

23-06-2025 08:55 PM

అనంతగిరి: సోమవారం అనంతగిరి మండల(Ananthagiri Mandal) పరిధిలోని శాంతినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 2 లక్షల 70 వేలు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాల పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామస్తులను, పోలీస్ శాఖను ఎమ్మెల్యే  ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్, మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బద్ధం కృష్ణారెడ్డి, గునుకుల గోపాల్ రెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.