14 April, 2026 | 1:59 PM

పసికందుపై ఊడి పడిన సీలింగ్ ఫ్యాన్

23-06-2025 12:45 AM
  1. గుడిహత్నూర్ పీహెచ్‌సీలో ఘటన

తృటిలో తప్పిన ప్రమాదం

అదిలాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు రోజుల పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. గుడిహత్నూర్ మండలం కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ పీహెచ్‌సీలో గత రెండు రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది.

ఆదివారం తల్లీ, కూతురు పడుకొని ఉన్న బెడ్‌పై ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో పాపకు గాయాలు కాగా, ఆసుపత్రి సిబ్బంది చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.