calender_icon.png 11 November, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం

11-11-2025 02:18:54 PM

- పాఠ్యపుస్తకాలను తరలించే ఆటో బోల్తా

- నలుగురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరం

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అమాలీలుగా వినియోగించుకున్నారు.  పాఠ్యపుస్తకాలను ఆటోలో తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.  ఈ ఘటనలో నలుగురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు పార్ట్ 2 పాఠ్యపుస్తకాలను ఆటోలో తరలించేందుకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను బరువైన పుస్తకాలను మోయిస్తూ వినియోగించారు. కాగా సాతాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు టైరు పేలి ఆటో బోల్తా కొట్టింది. 9వ తరగతి చదువుతున్న కార్తీక్,  అశోక్, నాని, శివ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో శివ అనే విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం ఫై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.