calender_icon.png 14 January, 2026 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎన్‌సీఈ కాలేజీలో సంబురాలు

13-01-2026 12:00:00 AM

ముఖ్య అతిథిగా జబర్దస్త్ సుధాకర్

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): స్థానిక జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం సం క్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు. ముఖ్య అతిథిగా జబర్దస్త్ సుధాకర్, ప్రత్యేక అతిథిగా సీనియర్ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి హాజరయ్యా రు. ముగ్గుల పోటీలలో ఉత్తమ మూడు ముగ్గులకు బహుమతి ప్రదానం అతిథులచే చేయబడినది. సాంప్రదాయ వంటకాల స్టా లల్స్ దాదాపు 20 ఏర్పాటు చేశారు.

జబర్దస్త్ సుధాకర్ విద్యార్థులతో సాంస్కృతిక కా ర్యక్రమాలలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లా డుతూ.. సాంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి తమ కళాశాలలో విద్యార్థులతో జరుపుకోవడం తమకెంతో ఆనందముగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వీ వెంకటరామారావు, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పి క్రిష్ణమూర్తి, ప్రిన్సిపాల్ పాలిటెక్నిక్  డాక్టర్ వీ ఈ చంద్రశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎ క్జామినేషన్స్ కె సందీప్‌కుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.