13-01-2026 12:00:00 AM
బండ్లగూడ జాగీర్, జనవరి 12 (విజయ క్రాంతి): మంచిరేవుల సమీపంలోని చిలుకూరు ఫారెస్ట్ పార్కు చిన్నారులు పర్యాటకులకు ఆహాల్లాదని పంచుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున సిటీ నలుమూలల నుండి చిన్నారులు, తల్లిదండ్రులు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పార్కుల్లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ చెక్ డాం, వ్యూ పాయింట్, ట్రెక్కింగ్. రాక్స్, నాచురల్ రాక్, వ్యూ పాయింట్, గజి బాస్, వాచ్ టవర్, పెద్ద చెరువు,వంటి 12 ఫ్యూ పాయింట్స్ తో ఇక్కడికి వచ్చే వారిని ఫారెస్ట్ పార్కు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆదివారం దాదాపు 2,000 మంది విజిటర్స్.
పేరెంట్స్ తమ చిన్నారులతో కలిసి ఇక్కడికి వచ్చి పక్షుల కిలకిల రాగాలతో అడవి అందాలను తిలకిస్తారు. ఒకసారి ఈ పార్కు వచ్చినవారు మళ్లీమళ్లీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఫారెస్ట్ అధికారులు జంతు సంరక్షణ కొరకు వేసవికాలంలో నీటి తొట్లు చెరువుల్లో నీటి నిల్వను ఏర్పాటు చేయడం వల్ల పక్షులు ఇక్కడ వృద్ధి చెంది కనువిందు చేస్తుంటాయి. ప్రతిరోజు వాకింగ్‌కు వచ్చే ఎంతోమంది ఆరోగ్యాని కాపాడుకోవడంతోపాటు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతుం టారు. మరి కొంతమంది ఫారెస్ట్ లో ఏర్పాటుచేసిన యోగా సెంటర్లో యోగా చేయ డంతో పాటు మరికొంతమందికి యోగాపై అవగాహన కల్పిస్తున్నారు.
మరికొందరు పెద్ద చెరువు సమీపంలో యోగా చేస్తూ ప్రకృతి ఒడిలో యోగాను ఎంజాయ్ చేస్తున్నారు.ఫారెస్ట్ అధికారులు ఆన్లైన్ పేమెంట్ ద్వారా టికెట్లను విక్రయిస్తూ ఒకరు ఒకరిక నుండి 30 రూపాయలు తీసుకుంటూ ఫారెస్ట్ లోకి అనుమతిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పార్కు ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ మెరుగైన వసతులు మంచినీరు వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సిటీలో బిజీబిజీగా ఉండే ఉద్యోగులు వ్యాపారవేత్తలు శని. ఆదివారం వారి పిల్లలతో కలిసి ఇక్కడకు వచ్చి బిజీ లైఫ్ నుండి ఉపశమనం పొందుతున్నారు.
ట్రిక్మింగ్‌రాక్స్, న్యాచురల్‌రాక్స్, రాక్ పాయింటుల వల్ల అడవి అందాలను చిన్నారులకు చూపిస్తూ వారికి తల్లిదండ్రులు అడవుల ప్రాధాన్యతలను వివరిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ తమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫారెస్ట్ లోని అన్ని సౌకర్యాలు కల్పించి విజిటర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నామని జంతు. వృక్ష సంపదను కాపాడేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతు న్నామని వారు పేర్కొన్నారు.
వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వ్యాపార స్తులు రాజకీయనేతలు సైతం ఈ పార్కులో ఫారెస్ట్ అధికారులు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో వారి వారి పనుల నిమిత్తం బిజీబిజీగా ఉండేవారు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి సేద తీరడంపై ఫారెస్ట్ అధికారులను మార్నింగ్ వాకర్స్ అభినందిస్తున్నారు. పార్కుతో ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు..
గత ఆరు సంవత్సరాల నుండి పార్కు లో వాకింగ్ చేస్తున్నాం
మంచి రేవుల దగ్గర ఫారెస్ట్ పార్కును అధికారులు ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ఇక్కడ సేద తీరుతున్నారు. సిటీ నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి ఎంతోమంది చిన్నారులు ప్రకృతి అందాలను తిలకిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిరోజు మార్నింగ్ వాక్ కు వచ్చే ఎంతోమంది అటు ఆరోగ్యాన్ని ఇటు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
- చింతల నరేశ్, నార్సింగి
శని ఆదివారాల్లో సందడే సందడి.
బిజీ లైఫ్ లో పార్కు లో ఎంతోమంది రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తో పాటు ఇతర ప్రాంతాల నుండి హైదరాబాదుకు బ్రతుకుతెరువు కోసం వచ్చిన ఎంతోమంది వారం మొత్తం బిజీ బిజీగా వారి పనులను చేసుకొని అలసిపోతున్నారు శని . ఆదివారాలు వారి చిన్నారులతో కలిసి చిలుకూరు ఫారెస్ట్ పార్కు కు వచ్చి ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతున్నారు పార్కులో మరిన్ని సౌకర్యాలు పెంచాలని కోరుతున్నాం.
- గోవిందు గారి శ్రీనివాస్ ముదిరాజ్