13-01-2026 12:00:00 AM
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్
ఘట్‌కేసర్, జనవరి 12 (విజయక్రాంతి) : యువత చైతన్యవంతంగా దేశభక్తిని కలిగి ఉండాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఉప్పల్ జోనల్ పరిధి ఘట్ కేసర్ పట్టణంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీ వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద స్వామి విగ్రహాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశంలోని యువతీ, యువకులకు ఎంతో ఆదర్శప్రాయుడన్నారు.
ఈ దేశ సనాతన ధర్మాలు సంస్కృతిని భగవద్గీత అర్థాలను ప్రపంచ దేశాలకు తన ప్రసంగాల ద్వారా తెలియజేసిన గొప్ప మహ నీయుడు వివేకానందుడని కొనియాడారు. నేడు యువతను డ్రగ్స్ మహమ్మారి పీడిస్తుందని, సెల్ ఫోన్ నే జీవితంలో మారిందని, అమ్మ, నాన్న, స్నేహితులతో మాట్లాడే టైం లేదని, అంతా కంప్యూటర్, సెల్ ఫోనే అయ్యిందని, అందులోనూ మంచిని ఆహ్వానించాలని చెడును దరిచేరనీయవద్దని యువతకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, బిజెపి అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జన సమితి పార్టీ నాయకులు మారం లక్ష్మారెడ్డి, కీసర దేవస్థానం ధర్మకర్త సగ్గు అనీత, కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్లు బర్ల శశిరేఖ, కొమ్మగోని రమాదేవి, జహంగీర్, మల్లేష్, రవీందర్, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు, కార్యదర్శి శశిధరన్, నాయకులు బర్ల దేవేందర్, రాజబోయిన రామచందర్ యాదవ్, సార శ్రీనివాస్ గౌడ్, ఖయ్యూం, శివరాత్రి సురేష్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.