సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (విజయక్రాంతి) : నగరంలో వరుస సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను బుధవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందు, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన కటెకల రోహన్‌రాజ్ అలియస్ శివ, విలాసవంతమైన జీవితం గడపాలని దొంగతనాల బాట పట్టాడు. ఇందుకోసం ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని రాత్రుళ్లు ఒంటరిగా రోడ్డుపై వెళ్లే వారిని టార్గెట్ చేసుకుని, వారి ఫోన్లను దొంగలించడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు.
ఇలా దొంగలించిన ఫోన్లను నగరంలోని పలు ఏరియాల్లో సెల్‌ఫోన్ రిపేర్ షాపుల వారికి తక్కువ ధరకు విక్రయించి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. నగరంలో వరుసగా జరుగుతున్న నేరాలపై అప్రమత్తమైన పోలీసులు మాటువేసి నిందితులు కటెకల రోహన్‌రాజ్(19) అలియస్ శివ, వి.డి.వివియన్(19), యుగేన్ అలెక్స్(19), నార్పేట్ సింగ్(19), సిరిగిరి రాజ్‌కుమార్(25)లను బుధవా రం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో తిరుమలగిరి, మార్కెట్ , నెరెడ్‌మెట్ పీఎస్‌లలో మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.






