కేబీఆర్ పార్కులో ప్రపంచ జీవ వైవిద్య దినోత్సవం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (విజయక్రాంతి) : అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం కేబీఆర్ పార్కులో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాణిప్రసాద్ మాట్లాడుతూ.. కాలుష్యం కారణంగా ప్రకృతి, సహజసిద్ధంగా జీవిస్తున్న ఎన్నో జంతు, వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. ప్రతి పౌరుడు అడవులు, నీటి వనరులు సంరక్షించుకుంటూ, పచ్చదనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి మోహన చంద్ర పర్గేయన్, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరి కాళీచరణ్ ఖర్తాడే , సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు ప్రశాంస పత్రాలు, బహుమతులు అందజేశారు.






