22 June, 2026 | 2:32 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

1,722 సెల్‌ఫోన్స్ రికవరీ

19-11-2025 12:00 AM
  1. బాధితులకు అందజేత.. వాటి విలువ రూ. 2 కోట్ల 75 లక్షలు 
  2. మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు ఎస్పీ  యం.రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి): సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం  లేదని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చు అని జిల్లా   యం. రాజేష్ చంద్ర మంగళవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైనదన్నారు. అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత ఫోటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందని ఎస్పీ  తెలిపారు.

మొబైల్ ఫోన్ పోగొ ట్టుకున్నవారు కేవలం పరికరాన్ని మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కోల్పోతున్నారు అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న, చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని, అలాగే సిమ్ కార్డ్ ను బ్లాక్ చేసి అదే నంబరుతో కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు.

అనంతరం సి ఈ ఐ ఆర్ వ్బుసైట్లో ఐఎంఈఐ నంబర్ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ను సులభంగా గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ  వివరించారు. పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్.బి.ఐ బాలరాజు  6 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృం దం ఏర్పాటు చేయబడింది అని అన్నారు. ఈ సంవత్సరం తొమ్మిధవ దఫాగా గత 15 రోజుల్లో ఈ బృందం 143 మొబైల్ ఫోన్లను రికవరీ చేసింది అన్నారు.

ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 1,722 మొబైల్ ఫోన్లు, సుమారు 2.75 కోట్ల విలువగల మొబైల్ ఫోన్లను, బాధితులకు అంద చేసినట్లు  ఎస్పీ  తెలిపారు. పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,169 మొబైల్ ఫోన్లు (6.67 కోట్ల విలువగలవి) రికవరీ చేసి బాధితులకు అందజే యడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 143 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ  అభినందించడం జరిగింది.

ఇప్పటి వరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల వివరాలు బాధితులకు తెలపడం జరుగుతుందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్‌ఐ బాలరాజు (ఫోన్: 8712686114) ని సంప్రదించి సంబంధిత వివరాలు చూపించి తమ మొబైల్ ఫోన్లను స్వీకరించవచ్చు అని తెలిపారు.