calender_icon.png 19 November, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నైస్ యాప్ కృషి చేస్తుంది

18-11-2025 11:36:08 PM

నైన్ అడ్వయిజరీ కమిటీ తెలంగాణ చైర్మన్ రాజేందర్ రెడ్డి..

ఖైరతాబాద్ (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలకు చెందిన గల్ఫ్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ’నైస్’ యాప్ కృషిచేస్తుందని నైన్ అడ్వయిజరీ కమిటీ తెలంగాణ చైర్మన్ రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ ఎన్. రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ భీంరెడ్డి తెలిపారు. మంగళవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కమిటీ సభ్యులు ఎన్.రంగయ్య, మచ్చ శ్రీనివాస్ రియాద్ తో కలిసి ఇందుకు సంబంధించిన వ్బుసైట్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 35లక్షల మందికిపైగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగం పొందుతున్నారని తెలిపారు. వీరి ఆరోగ్యం, వృత్తిరీత్యా, అభివృద్ధికి సంబంధించిన అన్ని సమస్యలకు నైస్ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. తమ టోల్ ఫ్రీ నంబర్ 1800113090 సంప్రదించాలని సూచించారు.