19-11-2025 12:00:00 AM
ములుగు,నవంబరు18(విజయక్రాంతి):ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ 5సం.ల వేడుకలను పురస్కరించుకొని దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికార శాఖ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మరి యు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బహిరంగ అవగాహన మరియు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవద్గీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి తుల రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు తూ అందరం కలిసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని సందేశం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని, మీ తల్లితండ్రులు మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి కుటుంబానికి, ఈ దేశానికి గొప్ప ఆస్తిగా ఎదగాలని సూచించారు.
చదువుతున్న యువతలో వారు స్వత హాగా మంచి ఆలోచనతో ఉన్నా కూడా చుట్టూ ఉన్న సహచరుల ప్రభావం వల్ల కూడా చాలా మంది సిగరెట్, గంజాయి వంటి డ్రగ్స్ కి అలవాటు అయ్యే ప్రమాదం ఉందని, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు అయితే వారు నుండి దూరం కావడం చాలా కష్టం, సమాజం కూడా ఇలాంటి వారిని చిన్న చూపు చూస్తుంది. ఇలా డ్రగ్స్ కి బానిస అయిన వారిని బయటకు తీసుకు రావడా నికి కేవలం కౌన్సిలింగ్ అనే ఒక మార్గం మాత్రమే ఉందని, ఎవరినైనా అలాంటి పరిస్థితుల్లో గుర్తిస్తే TGANB, నషా ముక్త్ భారత్ అభియాన్ విభాగాలను సంప్రదించాలని అన్నారు. ఒక అందమైన జీవితం మీ కోసం ఎదురుచూస్తుంది దానిని సాధించడం కోసం ప్రయత్నించాలని సూచించారు.