07-08-2024 06:04:21 PM
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ ఫొగట్ అనర్హత వేటపై లోక్ సభలో కేంద్రం వివరణ చేసింది. ఫొగట్ నిర్ధేశిత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. వినేశ్.. గతంలో భారత్ తరుపున పోటీ చేసి అనేక విజయాలు సాధించిందని, వినేశ్ అత్యుత్తమ శిక్షణ తీసుకునేలా కోచ్ లు, సహాయ సిబ్బందిని నియమించాం, ఫిజియోథెరఫిస్ట్ కూడా ఉన్నారని, ఆమెకు ప్రభుత్వం అని రకాలుగా అండగా నిలిచిందని మన్సుఖ్ మాండవీడ్ తెలిపారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వద్ద భారత్ తన నిరసన తెలిపిందని, వినేశ్ ఫొగట్ అనర్హతపై తగ్గిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీటీ ఉషకు సూచించినట్లు మాండవీయ వ్యాఖ్యనించారు.