calender_icon.png 11 July, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ సంక్షోభం.. సరిహద్దులో నిలిచిన ఉల్లి లారీలు

07-08-2024 06:27:19 PM

న్యూఢిల్లీ: భారత్ రైతులపై బంగ్లాదేశ్ సంక్షోభం ప్రభావం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కు ఎగుమతి కావాల్సిన ఉల్లి లారీలు సరిహద్దుల్లో నిలిచిపోయాయి. బంగ్లాలో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఎగుమతులపై వేల కోట్ల ప్రభావం చూపుతుండడంతో వందలాది ఉల్లి లారీలు బంగాల్ చంగ్రబంధ సరిహద్దులో నిలిచిపోయ్యాయి. బంగ్లాకు 80 వేల టన్నుల ఉల్లి ఎగుమతిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

కానీ, బంగ్లాదేశ్ లో అనిశ్చితి దృష్ట్యా ఉల్లి ఎగుమతులు నిరాకరించడంతో ఉల్లి రైతుల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. సరిహద్దులో నిలిచిన ట్రక్కులను అనుమతించాలని రైతులు కోరారు. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతల దృష్ట్యా ఎంబసీ సిబ్బంది ఢాకా నుంచి భారత్ చేరుకున్నారు. భారత హైకమిషన్ నుంచి 190 మంది సిబ్బంది స్వదేశం చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా భారత సిబ్బందితో పాటు వారి కుటుంబాల తరలించారు.