07-08-2024 05:12:58 PM
న్యూఢిల్లీ: రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్ పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడింది. ఈ అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ ద్వారా స్పందించారు. వినేశ్ ఫొగట్ తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారని రాష్ట్రపతి కొనియడారు. వినేశ్ కు అందరూ అండగా నిలవాలని, 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్ ఛాంపియన్ గా నిలవడం దేశానికి గర్వకారణమని, మీరూ ప్రతీ భారతీయుడికి స్పూర్తి అని ఆమె అన్నారు. భవిష్యత్తు క్రీడాకారులకు ఫొగట్ ఆదర్శంగా నిలుస్తారని, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఇవాళ జరిగిన ఘటన బాధించవచ్చు.. సవాళ్లకు ఎదురొడ్డి నిలబడటం వినేశ్ స్వభావం అని పేర్కొన్నారు.