calender_icon.png 7 December, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెకు బీసీ సీ సర్టిఫికెట్ రద్దు చేయాలి

07-12-2025 12:00:00 AM

తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుల సంఘాల ధర్నా    

సుల్తానాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండ లంలోని తోగర్రాయి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ చిలుక స్రవంతి బీసీ ‘సీ’ సర్టిఫికెట్ తీసుకొని సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేయడం నిరసిస్తూ గ్రామంలోని వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. ఎస్సీ మహిళకు ఇచ్చిన బీసీ ‘సీ’ సర్టిఫికెట్ రద్దు చేయాలని కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

అనంతరం తహసీల్దార్ గిరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బీసీ మహిళలకు వచ్చిన అవకాశాన్ని సర్టిఫికెట్ రూపంలో హరించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళల హక్కులను కాలరాయాలని చూస్తున్న సర్టిఫికేట్‌ను అధికారులు రద్దు చేయాలని కోరా రు. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే బీసీ ‘సీ’ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగిందినీ వా రు ఆరోపించారు. ఎస్సీ మ హిళా క్రిస్టియన్ గా కన్వర్ట్ అయి బీసీ‘సి’ సర్టిఫికెట్ పొంది  నామినేషన్ దాఖలు చేశారని వారన్నారు,  అధికారులు తక్షణమే స్పందిం చి బీసీ మహిళలకు న్యాయం చేయాలని, తక్షణమే సర్టిఫి కెట్ రద్దు చేయాలని కోరా రు.

గర్రెపల్లి సింగి ల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, నాయకులు బోయిని రాజమల్లయ్య, సూర శ్యామ్ తదితరులు మద్దతు తెరిపారు. కార్యక్రమంలో గుండ మురళి,  శ్రీనివాస్, రాయ మల్లు, గ్రామస్తులు చంద్రమౌళి, శంకరయ్య, భాస్కర్ రెడ్డి,  శేఖర్, శంకరయ్య, కొమురయ్య, తిరుమల, రాధా, తార, భూలక్ష్మి తదితరులున్నారు.  నిబంధనల ప్రకారమే ఆ మహిళకు సర్టిఫికెట్ జారీ చేశామని ఇందులో తమ తప్పేం లేదని తహసీల్దార్ గిరి వివరణ ఇస్తూ  పేర్కొన్నారు.