21 May, 2026 | 2:42 AM

మెట్రో రెండో దశకు కేంద్రం.. గ్రీన్ సిగ్నల్!

21-05-2026 01:11 AM

కేంద్రమంత్రి ఖట్టర్‌తో సమావేశమైన కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే20(విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రెండో దశపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలి పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

కేంద్ర ప్రభుత్వ పట్టణాభి వృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై ఆయనతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాభి వృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాకుసంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి మెట్రోను టేకేవర్ చేసుకు న్న నేపథ్యంలో.. మిగిలిన మెట్రో రెండోదశ పనులకు సంబంధించిన డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభు త్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి ని ర్ణయం తీసుకుంటుందని ఖట్టర్ చెప్పారన్నారు.

హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వా నికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించినట్లు పేర్కొన్న ఆయన.. దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. 

39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు..

హైదరాబాద్‌లోని మూసీనది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వివరాలను వెల్లడించారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృ త్ 2.0 పథకంలో భాగంగా.. మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మం జూరు చేసినట్లు, ఈ ప్రాజెక్టుల మొత్తం వ్య యం రూ.3,975 కోట్లని తెలిపారు.

ఈ 39 ఎస్టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీ టర్ల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉం దన్నారు. దీని వల్ల శుద్ధిచేయని వ్యర్థపు నీరు నేరుగా మూసీనదిలో కలవకుండా నిరోధించడంతోపాటు.. మూసీనది పరిరక్షణ, నగర పారిశుద్ధ్య మెరుగుదలకు ఇది ఎంతో దోహదపడుతుందని ఖట్టర్ వెల్లడించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లో సహకారం అందిస్తోందన్నారు.