17 July, 2026 | 2:38 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

జీడబ్ల్యూడీ నాన్ గెజిటెడ్ పోస్టులకు 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్

28-08-2024 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): గ్రౌండ్ వాటర్ విభాగం (జీడబ్ల్యూడీ)లోని నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఈ నెల 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్టు కార్యదర్శి నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్స్ లింక్ 30, 31 తేదీల్లో అందుబాటులో ఉం టుందన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్టును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన వారి జాబి తాను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

నేటి నుంచి టీఎస్ ఎప్‌సెట్ స్పాట్ కౌన్సెలింగ్

ఎప్‌సెట్ స్పాట్ కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లను ఆయా కాలేజీలు బుధవారం జారీ చేయాల్సి ఉంటుంది. 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు సీట్లను అభ్యర్థులకు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 3న అడ్మిషన్లు పొందిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమో దు చేయాల్సి ఉంటుంది. అదే నెల 4న అడ్మిషన్ల వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.