16-10-2025 01:55:55 AM
పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పి రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, అందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. .చైతన్యం పేరుతో బుధవారం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మాలన కోసం వివిధ రకాల అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల రోజుల పాటు జిల్లా పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు భాద్యతగా సహకారం అందించాలని కోరారు.
ఎవరైనా నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు , విక్రయిస్తున్నట్లు , సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. చైతన్యం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్త్స్రలు ప్రవీణ్,రామారావు తదితరులు పాల్గొన్నారు.