calender_icon.png 16 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం

16-10-2025 01:54:20 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన సీమఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీకి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో పినపాక మండలానికి చెందిన పలువురు సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా  మంజూరైన చెక్కులను అందజేశామని తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గోపాల కృష్ణ, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ గుమ్మడి వినీత, ఏపీవో వీరభద్రస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం,వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.