26-09-2025 12:19:47 PM
నివాళులర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల: (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల అధికారులు, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.