calender_icon.png 26 September, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి దేవిగా వనదుర్గమ్మ..

26-09-2025 12:15:13 PM

కన్నుల పండువగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

అమ్మను దర్శించి తరిస్తున్న భక్తజనం.

పాపన్నపేట, విజయక్రాంతి: మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు శుక్రవారం చవితి పురస్కరించుకొని వనదుర్గామాతను మహాలక్ష్మి(స్కందమాత) దేవి రూపంలో, పెసర రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి పెసర రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. జిల్లాలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మను దర్శించి తరిస్తున్నారు. మొక్కులు చెల్లించుకొని చల్లంగా చూడమ్మా.. దుర్గమ్మ తల్లి.. అంటూ వేడుకుంటున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

నేడు కాత్యాయని దేవిగా వనదుర్గమ్మ దర్శనం

 దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజైన శనివారం వనదుర్గామాత లలితా త్రిపుర సుందరి (కాత్యాయని) దేవి రూపం, ముదురు నీలం రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, అర్చకులు తెలిపారు.