calender_icon.png 28 October, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్

28-10-2025 12:03:17 AM

-చంద్రన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 సిమెంట్ బస్తాల పంపిణీ

-ఎమ్మెల్యే చేతుల మీదుగా సిమెంట్ బస్తాల పంపిణీ

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన డొంకనీ  గోపి గౌడ్, శ్రీనివాస్ గౌడ్  తన తండ్రి డొంకని చంద్రయ్య గౌడ్  అనారోగ్యం తో మృతి చెందడం తో, తండ్రి కొరిక ఆలోచన మేరకు కుమారులు డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ఖానాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చంద్రన్న  ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఒక్కొకరికి 20 సిమెంట్ బస్తాలను  అందజేశారు.

సిమెంట్ బస్తాలను పంపిణీ చేస్తున్నందుకు, గ్రామానికి సేవ చేస్తున్నందుకు చంద్రన్న  వారసులుగా గోపి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ లను ఎమ్మెల్ మల్రెడ్డి రంగారెడ్డి , గ్రామస్తులు, పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిన అందరూ సద్వినియోగ పరచుకోవాలని, నియోజకవర్గ అభివృద్ది ధ్యేయం గా పని చేస్తున్నామని , ప్రస్తుతం లబ్ధిపొందిన వారు పూర్తి చేసిన అనంతరం, మరో 40 ఇండ్లను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామంలో  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైనా వారందరికీ సిమెంట్ బస్తాలను ఉచితంగా  అందజేస్తామని ఫౌండేషన్ ఛైర్మెన్ గోపి గోపి గౌడ్, వైస్ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామంలో త్రాగు నీళ్ళకోసం త్వరలో ఉచితంగా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.  గ్రామ అభివృద్ధికి చంద్రన్న ఫౌండేషన్ ఎంతో సహాయ పడుతుందని అన్నారు.