28-10-2025 12:01:54 AM
మై హోమ్ యాజమాన్యం
మఠంపల్లి, అక్టోబర్ 27: ఇండస్ట్రీ పరిసర గ్రామాల అభివృద్ధికి మై హోమ్ యాజ మాన్యం సహకరిస్తుందని యూనిట్ హెడ్ ఎన్.శ్రీనివాస్ రావు తెలిపారు.మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హల్‌కి అనుబం ధంగా డైనింగ్ హాల్ నిర్మాణం కోసం స్థానిక మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు శుభవార్త దేవాలయం ఫాదర్ రాజారెడ్డి, కమిటీ సభ్యులు చిన్నపరెడ్డి సోమవారం తెలిపారు.
ఈ 15 లక్షల చెక్కుని సంస్థ యూనిట్ హెడ్ యన్. శ్రీనివాసరావు అందచేసి మాట్లాడుతూ సంస్థ సామాజిక కార్యక్రమములలో భాగంగా గతంలో కూడా శుభవార్త దేవాలయం నందు సుమారు 24 లక్షల రూపాయలతో దేవాలయం ప్రాంగణంలో సిసి ఫ్లోరింగ్, డైనింగ్ హల్ కోసం సీసీ ఫ్లోరింగ్ పనులు చేసినట్లు తెలిపారు.పరిసర గ్రామాల అభివృద్ధి కోసం గ్రామస్తుల సహకారాలతో సంస్థ సామజిక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ జి.యం శ్రీరామ్,ఏ.జి.యం శ్రీనివాస్,దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ ఆదూరి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.